![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -843 లో... రిషి ఏంజెల్ కి టైమ్ కి తిని హ్యాపీగా ఉండమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏంజిల్ కి వసుధార ఫోన్ చేస్తుంది. పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నీకు ఎవరైనా నచ్చారా అంటూ వసుధార అడుగుతుంది. మనకి నచ్చినట్టు ఎలా తెలుస్తుందని ఏంజిల్ అడుగుతుంది. మనల్ని అర్థం చేసుకునేలా ఉండాలంటూ కొన్ని విషయాలు వసుధార చెప్తుంది. సరే ఏదైనా ఉంటే నీకు చెప్తానని ఏంజిల్ అంటుంది.
ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి ఏంజిల్ వెళ్లి.. టాబ్లెట్స్ ఇస్తుంది. పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అని విశ్వనాథ్ అడుగుతాడు. ఆలోచిస్తానని ఏంజిల్ చెప్పగానే విశ్వనాథ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంజిల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి రిషి వస్తాడు. ఏంజిల్ ఏంటో ఆలోచిస్తానని అంటుంది.. ఏంటని రిషి అడుగుతాడు. ఇన్ని రోజులు పెళ్లి టాపిక్ వస్తే కోప్పడేది కానీ ఇప్పుడు ఆలోచిస్తానని అంటుందని విశ్వనాథ్ హ్యాపీగా రిషికి చెప్తాడు. మరొకవైపు పాండియన్, అతని స్నేహితులు కలిసి కాన్ఫరెన్స్ లో రిషి చెప్పిన వర్క్ చేస్తూ డిస్కషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే రిషి వాళ్ళకి ఫోన్ చేసి.. మీరు పంపించిన వర్క్ బాగుందంటు చెప్తాడు.
ఆ తర్వాత రిషి విశ్వనాథ్ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా రేపు వసుధారతో ఏంజెల్ గురించి మాట్లాడాలని రిషి అనుకుంటాడు.. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం.. వసుధార క్లాస్ లో ఉండగా రిషి క్లాస్ ముందు నిలబడి.. వసుధారని చూస్తాడు. వసుధార చూడగానే వెళ్ళిపోతాడు. మేడం మీతో మాట్లాడాలని వసుధారకి రిషి మెసేజ్ చేస్తాడు. వసు కావాలనే రిషితో ఇందాక మీరు క్లాస్ ముందు సైట్ కొట్టినట్లు చూస్తున్నారని వసుధార అనగానే.. సైట్ కొట్టడాలు, కన్ను కొట్టాడాలు, నాకేం తెలియవని రిషి అంటాడు. మీతో మాట్లాడాలి వెళ్ళేటప్పుడు కలవండని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి.
ఆ తర్వాత వసుధార కాలేజీ అయిపోయాక బయటకు వస్తుంది. రిషి కార్ వసుధార ముందు ఆపి డోర్ తియ్యగానే వసుధార కార్ ఎక్కుతుంది. ఏంజిల్ ఎవరైనా ఇష్టపడుతుందా అని కనుక్కోండని వసుధారతో రిషి అంటాడు. ఏంజిల్ మీ ఫ్రెండే కదా ? మీరు అడుగవచ్చు కదా అని వసుధార అంటుంది. ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని నేను అడగలేనని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |